తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి

ఓ ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐపీఎస్ అధికారి విక్రమ్ కపూర్ ఫరీదాబాద్ నగర డీసీపీగా పని చేస్తున్నారు. ఈ ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని పోలీస్ లైన్స్ లోని సెక్టార్ 30లోని తన నివాసంలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇటీవలి కాలంలో ఐపీఎస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 
Go Back to Shorts
Vikram Kapoor
IPS
Suicide

More Telugu News